Jayaprabha  ( జయప్రభ)
Translator

on Lyrikline: 4 poems translated

from: alemão to: telugu

Original

Translation

Mantra

alemão | Tom Schulz

Wir müssen wieder mit dem Herzen sehen. Durch den Klee und den Schnee. Durch die Krone des Affenbrotbaums. Wo die Schlehe den ersten Frost erwartet. Wo das Land mit Flechten bewachsen ist.
Kindchen, in einer Plastikspielzeugpuppe befindet sich mehr Gift als in einem Autoreifen. Wie viel ist wenig und wie viel ist viel? Wir müssen uns ein Herz fassen, gleichzeitig das eine oder andere Nebenorgan verkümmern lassen. Die Sehhilfe auf die Nasenwurzel schieben. Müssen wir? Ertasten. Was? Unter den Zwei- bis Dreiäugigen war ich stets ein Sehender. Vorwärts und nicht vergessen. Ich trage alle Dinge in einem Herzbeutel durch mein Dörfchen. An die Pumpe, wo wir uns mit den Hinterbänklern trafen. Eine wollte Blindekuh spielen. Dann Mau-Mau.
Ich schenkte ihr ein Feld aus Zuckerrüben. Die stolzen Männer erreichten die Stadt mit einer Büffelherde und gekauften Frauen im Gepäck. Könnten wir mit dem Herzen sehen, wäre die Taube auf dem Fenstersims eine fremde Schöne. Wenn wir jetzt weiter zweifeln, lachen noch die Hühner.
Wir könnten einfach weitergehen. Durch die Savanne und die Nesselwüste. Durch alles Fieber und den blinden Nebel. Unter der Brücke liegt ein Mann im Regen auf seiner alten Federkernmatratze. Ihr könnt mich mal.
Im Mondschein oder auf der Heide. Dem einen fehlen nur zwei Schneide- zähne. Davon haben wir doch viel zu viele. Wir anderen. Könnten wir einen Erlöser rufen. Wären wir Maden oder Mistbienen. Wären wir die sieben Zwerge. Sprechen wir lieber über menschliche Ressourcen.
Die stolz bezahlten Männer renovieren die Kaufhausstadt. Entwerfen aus Pappkisten Wohnungen. Verpachten eine Hundetoilette für alles, was Beine hat. Wer besitzt alles, vieles oder nichts? Die gleichgestellten Frauen aus dem Ausschuss haben sich Damenbärte zugelegt. Damit sie dem Konsul zum Verwechseln ähnlich sehen. Kindchen, die Gummibären machen süchtig. Enthalten Gifte, die zum Tode führen. Die uns abhängig machen von den toxischen Konzernen. Wir müssen sehen, müssen sehen, sehen.
Sehen. Hinauf zu den zerschossenen Sternen. Hinauf zur Sternenrettung. Mensch, atme zufrieden durch die Nasenlöcher. Atme und spüre eine Wärme in den Nasenlöchern.

© 2015 Hanser Berlin in der Carl Hanser Verlag GmbH & Co. KG, München
from: Lichtveränderung. Gedichte
München: Hanser Berlin, 2015
Audio production: Goethe Institut, 2016

మంత్రము

telugu

చూడడం  అనేక రకాలు ! 
" క్లే " పూల చెట్టు  తాలూకు నాలుగు దళాల్లోంచి 
 లేదా  మంచు లోంచి 
పోనీ  పొడవైన  ' బువాబ్ ' చెట్టు పైని 
గుండ్రపు  కిరీటపు గుబురు  లోంచి  . 

నాచు ఎక్కడ అధికమో ... 
అక్కడ .
తొలిమంచు  ఎప్పుడు పడుతుందా 
తమని కోయడానికి ,  అని  
ఎదురుచూస్తున్నాయి పండిన ' ప్లమ్ ' పళ్లు . 

ఒరే కన్నా ! 
నువ్వు ఆడుకునే  ఆ ప్లాస్టిక్  బొమ్మ లో 
కారు టైరు లో కన్నా  విషం ఎక్కువ ! 
ఎందులో ఎంత పాలు విషమని 
ఏమి విచికిత్స  చేస్తాంలే ?! 
గుండెని చిక్కబట్టుకోవాలి మనం ఇంక --
మనలోంచి ఏదో ఒక అవయవాన్ని 
పోగొట్టుకోవడానికి  ! 

చూపుకి ఒకింత సాయం చేదామని 
చేత్తో పట్టుకున్న  కళ్లజోడుని 
ముక్కు మీదికి చేర్చాను ! 
మూడు కళ్లున్న వాళ్లతో పోలిస్తే 
నేనే  ఎక్కువ  చూడగలను . 

" పదండి ముందుకు  పదండి తోసుకు 
పోదాం  పోదాం  పై పైకి  " 
నావైన  వాటిని  జాగ్రత్తగా  నా గుండెసంచి లో  దాచుకుని 
పల్లెకి ప్రయాణం కట్టాను . 

పల్లెకొచ్చేసరికి ,
స్కూలులోని  వెనకబెంచీ స్నేహితులని 
చేతి పంపు  దగ్గర  కలిసాను . 
అందులోంచి  ఒక స్నేహితురాలు 
కళ్లకి గుడ్డ కట్టుకుని  ఆడుకుందామని పిలిచింది . 
ఆ తరవాత  కాసేపు  ముక్కలాట . 
ఆమెకి నేను  చిలగడదుంప  పొలాన్ని బహుమతి గా ఇచ్చాను . 

 బలమైన పశువుల మందల తో 
దాసీ జనాలు  వెంటరాగా దర్పంగా  నడుస్తూ... 
మగవాళ్లు కొందరు  పట్నం చేరారు . 

మనసుతో  చూడవయ్యా  ! 
కిటికీ సజ్జ మీద కూచున్న 
అసహ్యమైన 
ఆ బూడిద రంగు పావురం  కూడా 
పరస్త్రీ లా అందంగానే ఉంటుంది . 
సందేహిస్తే ఇంకా మనం .. 
జనాలు పరిహసిస్తారు . 

మున్ముందుకి  పోగలిగివుంటే  మనం 
 సవానా మైదానాల  లోంచి 
చిన్ని చిన్ని దురదగొండి పొదల లోంచి 
అనేక రకాల జ్వరాల నించి 
దట్టమైన పొగమంచు నించీ ... 

వాన పడుతూ ఉంటే - 
వంతెన కింద దూరి అతడు 
తన పాత స్ప్రింగ్ పరుపు మీద 
పడుకున్నాడు 
fu...k..y..u ! 

వాడి దగ్గిర ఏమీ లేదు 
కానీ మనం మాత్రం వేరు ! 
చాలా కలిగిన వాళ్ళమే 
కాస్త వాడికీ ఇవ్వగలం !
పోనీ 
ఒక రక్షకుడినైనా పిలవగలం ! 

పెంట మీది పురుగులమో 
పుళ్లమీది ఈగలమో .. లేదా 
ఏడుగురు మరుగుజ్జులమో  అయితే 
మనుష్యుల ప్రాముఖ్యాన్ని .. ప్రాధాన్యాన్ని గురించి  కాదూ .. 
మనం మాట్లాడాలి !? 

ఆ గొప్ప గొప్ప మనుష్యులు 
తమ పెద్ద పెద్ద దుకాణాలని 
మరమ్మత్తులు చేసుకుంటారు 
అగ్గిపెట్టె ల్లాంటి  ఇళ్లుకట్టి 
కాళ్లున్న  ఎవరికైనా  అద్దెకిస్తారు . 

అటు అన్నీ వున్నవాళ్లు 
ఇటు ఏమీ లేని వాళ్లు . 
మగవాళ్ళకి నకలుగా కన్పించడానికని 
సమానత్వం పేర  గడ్డాలు పెంచుకున్న ఆడవాళ్ళూ ! 

ఒరే కన్నా ! 
ఆ చాక్లెట్లు తింటే 
క్రమేపీ వాటికి వ్యసనం అయేలా చేస్తాయవి ! 
వాటినిండా వున్నది విషమే ! 
క్రమంగా మనల్ని విషానికి అలవాటు చేస్తాయవి 
అలా అలవాటు పడ్డామా ... 
చివరికి మృత్యువే ! 
అందుకే మనమంతా తప్పక ఈ  సంగతులని గురించి  గాఢం గా  
ఆలొచించాలి ! 
అన్నీ గమనించాలి 
అన్నిటినీ  నిశితంగా  చూడాలి .. చూడాలి .. చూడాలి !  

ఒకసారి తలపైకెత్తి 
ధ్వంసమయే నక్షత్రాలని  చూడండి . 
ఎన్నిటినో రక్షించుకోవడానికి 
ఒక రక్షణ వ్యవస్థ ని  అత్యవసరంగా 
తయారు చేసుకోవాల్సి  ఉంది . 

జనులారా ! 
ఉఛ్వాస  నిశ్వాసాల వెచ్చదనాన్ని అనుభవిస్తూ ... 
ఊపిరి తీసుకోండిక తృప్తిగా !

Translated into Telugu by Jayaprabha

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2016 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin

Praga, danach

alemão | Tom Schulz

Zu viel was ich sah in vier Tagen. Ich muss die Augen dimmen.
Ich sah den Regen vor dem Regen. Ich sah ihn hinterher.
Ich sah Wolken inmitten von Wolken. Ich sah den Himmel leer.
Sah Fülle, die einem Gesetz folgte, zu entbehren. Etwas in die
Welt zu setzen, das hilflos war. Wäre nicht zweimal ich, wäre
nichts.
Was ich hörte, war gesprochen. Was ich sagte, war geflossen.
Ich sah im Fluss die Bewegungen. Ich spürte in allem
Regungen.
Alle Regungen. Das Brechen von Plastikbechern. Das
Versprechen. Zu zweit. Gleich zu sein. Der Schnaps und der
Raps. Und die Reife. Die Steifheit. Der Glieder. Die Streifen.
Die Schlieren. Das Hier.
Ich sah und ich sagte. Zu viel was ich sah in vier Tagen. Zu viel
was in sich versank. Es tagte und drinnen tagten Dirnen. Birnen
faulten.
Vor den Plätzen. Jemand sprach vor. Und sagte. Oder ein Vers
hob an. Das Versagen. In allem war Sagen. Waren Segel und
Ankerplatz.
Ich hob den Becher auf den Segen. Inzwischen war Dunkelheit.
Ein Schatz. Zu bergen. Arme und Beine. Deine meine keine.
Zu viel was ich gesehen hatte. Licht und Schatten. Schmerz.
Und das Stillen. Keines war besser als das andere. Jedes war. 

© 2015 Hanser Berlin in der Carl Hanser Verlag GmbH & Co. KG, München
from: Lichtveränderung. Gedichte
München: Hanser Berlin, 2015
Audio production: Goethe Institut, 2016

ప్రాగా నుంచి వచ్చాకా....

telugu

చాలా  చూసానబ్బా ! 
ఇంక  చూడాలని  లేదు. ​
కొద్దిగా  కన్నులర  మోడ్చి 
చూపుని  సేద  తీర్చాలి.

వాన రాకముందే  వానని  చూసాను 
వచ్చాకా  వానని  మళ్ళీ  చూసాను 
మేఘాల మధ్య  అల్లుకున్న 
మేఘాల్ని  చూసాను 
పిమ్మట 
ఖాళీ  అయిన  ఆకాశాన్ని  చూసాను 
ఒక  సూత్రాన్ని  అనుసరించే  దానిని 
చాలానే  చూసాను 
సూత్రాలని  అనుసరించే  దానిని 
అనుసరించకుండా  ఉండాలని  చూసాను.

ఒక  శిశువునీ  లోకంలోకి  తెచ్చాను 
వచ్చిన  ఆ  శిశువు  నిస్సహాయంగా  వుంది.
నేను  రెండుగా  గనక  ఉండి  ఉండక  పోతే… 
ఏమీ  ఉండేది  కాదు !

నే  విన్నదాన్నే  వాళ్ళూ  చెప్పారు 
నేను  చెప్పినది  గతించి  పోయింది !

చెరువులోని  కెరటాలలా  చలనం 
అంతటా  చలనం 
నేను  అనుభవించాను !

ఆవాలతో  విస్కీని  చేయలేం !
సమానత్వాన్ని  పాటిస్తామని 
ప్రమాణాలని  చేసుకున్నా...
ప్లాస్టిక్  కప్పుల మాదిరి  అవి 
ఫెటిల్లున  విరిగి పోయాయి !

కదలని  కాళ్ళూ ... చేతులూ !
ఆ చారలూ ... ఆ మరకలూ ..  
అలికినట్టుగా  మిగిలాయి !

చాలా  చూసాను 
నేను  చాలానే  చెప్పాను 
ఈ  నాలుగు  నాళ్ళలో 
నాలో  నేనే  మునిగాను !

తెల్లారిపోవచ్చింది 
లోపల  ఇంకా 
వేశ్యల  సమావేశం  ఉంది !

కుళ్ళిపోయిన  పేర్  పళ్ళు.
పరీక్షించే  వాళ్ళముందు  
ఎవరిదో  ప్రదర్శన 
ఎవరిదో కవిత్వపఠనం 

లంగరు వేశాకా  మరింక  ప్రయాణం  ఎలా  ఉండదో...
అలా -  
చెప్పడమూ...
చెప్పింది  చేయలేక  పోవడమూ !!

టోస్ట్ కోసం  ఎత్తిన చేతితో 
దీవెనలందించ  లేను !
ఇంతలో  చీకటి  పడింది. 
  
దాచి పెట్టడం కోసం 
ఒక  విలువైన  నిధి !
కానీ  చివరికవన్నీ 
చేతులూ  కాళ్ళూను.
అయితే  అవి  నీవి నావీ  కావు 
ఎవరివీ  కావు 

అబ్బా !
చాల  ఎక్కువే  చూసాను 
వెలుగు ..  నీడ 
బాధా...ఉపశమనం 
ఎక్కువా .. తక్కువా  
అసలు  ఇవేవీ  నిజంగా  లేవు ! 
ఎందుకంటే  
ఏ  ఒక్కటీ  రెండవదాని కన్నా 
గొప్పదేం  కాదు !
ప్రతీదీ  దేనికదే !!

Translated into Telugu by Jayaprabha

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2016 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin

Alter Schulweg

alemão | Tom Schulz

I

die goldenen Birnen, herein geschraubt in die Fassung des
Abends, wie viele Wochen sah ich euch unreif, das Fleisch
gehörte den Wespen, später, Augustende

großer Sommer, der ewige Ferientag
es hörte nicht auf, die Sonne bildete Staub wir legten unsere
Lippen auf den Rhabarber flüsterten, bleib stehen, blödes Herz

im Innern des Leierkastens –
die Bahnen waren schartig von ledernem Grün das Wasser
wurde ausgewechselt, ein Lindenblatt verfärbte das
Schwimmbad



II

Augustende, in Körben trugen wir die Köpfe von Pilzen, unsere
Wäsche schimmerte bleich wenn wir uns hinter Bäumen
auszogen mutierten die Mädchen zu einer Blumenwiese

um die sich eine Hecke schloss, so weht der Wind von der
Seite, das Sentiment unterspült die rissigen Kunststeinplatten
die Einfassung zu den Beeten hebt sich

ein Stück - ich kann die Kraftwerkswolke formen aus der Luft
nach all den Jahren den Kohlestaub, der auf die Fensterbretter
sank, Vater, der zweimal am Tag schlug

wie eine Kuckucksuhr, jemand schaute heraus, ein
Wachtmeister, verkleidet als scheues Waldvögelein, der stille
Portier führte Buch und abends schrieb der Mond

Berichte, todmüde der Sommer, die Katze
auf dem Hochhausdach, der Hund würde leben Menschen
verschwanden aus dem Mittelpunkt der Dinge

als die Planwagen fortgezogen waren einsilbig das Gras,
glänzend
wie grünes Blut

die nackten Füße liebkosen
die Büschel, dann fährt die Erinnerung vor eine abgedunkelte
Limousine 

© 2015 Hanser Berlin in der Carl Hanser Verlag GmbH & Co. KG, München
from: Lichtveränderung. Gedichte
München: Hanser Berlin, 2015
Audio production: Goethe Institut, 2016

పాత స్కూలు తోవ

telugu

నేనలా చూస్తూండగానే ... 
ఆ  నడివేసవిలో ... లేత బంగారం రంగులో మెరుస్తూ 
రబాబ్  పొదల  మీద  పెదాలాన్చి  మనం 
గుసగుసలాడుకున్నాం !
అమాయకంగా  అలా  నిలబడిపోయాం 
బయస్కోప్ ముందు . 

ఖాళీ ఈతకొలను  అడుగురేఖల మీద శిశిరంలో 
రాలిపడిన  ఆకులు 
తమ వర్ణాన్ని కొలను నేలకి కూడా అంటించాయి 
రాలిపడిన  ఆకులు ,
పాచిపట్టిన నీళ్ల మీద . 

ఆకురాలు కాలాన ... వెదురుబుట్ట నిండా 
పుట్ట గొడుగులని ఏరుకుని ... 

తోట మధ్యలో ఆరేసిన 
వెలిసిన  నిక్కర్ల మీద ఎండపడి 
అవి తళతళ  మెరుస్తున్నాయి 
చెట్ల వెనకగా  మేం బట్టలు  మార్చుకుంటున్నాం 
పచ్చిక మైదానం మీది అమ్మాయిలు 
పువ్వుల్లా మారిపోయారు 

బొడ్డెత్తుకెదిగిన  ఆ  రుబాబ్ పొదల జ్ఞాపకాలు 
కూరమళ్ల చుట్టూ  పాతిన సిమ్మెంటు  దిమ్మలు 
నీళ్లతో తడిసి 
కాస్త పైకి లేచాయి ! 
గనుల నుంచి చెలరేగింది 
గరుకు బొగ్గు ధూళి 
గడియారంలోని  పిట్ట 
మళ్లీ వచ్చింది  గస్తీ తిరిగేవాడి వేషంలో  


నిఘానేత్రం 
చంద్రుడు రిపోర్ట్  రాస్తున్నాడు 
శక్తి తగ్గిన  వేసవి , 
ఎత్తైన ఇంటికప్పుమీద కూచుని 
సత్తువ పోయిన పిల్లి ,
కుక్కమాత్రం బతకొచ్చు బహుశా ! 
తమకి చిరపరిచితమైన ప్రదేశాల నించి 
 జనం​ అదృశ్యమైపోయారు . 


వరసకట్టి పోతున్నాయి గూడుబళ్లు 
అక్కడ నిలబడి 
ముక్తసరిగా మాట్లాడే  అతడు , 
ఆకుపచ్చటి రక్తమోడుతూ ... 
అక్కడో గడ్డి పరక  !  


నగ్నపాదాలు మెత్తటి గడ్డిని 
సుతారంగా  నిమురుతున్నాయి  !
నల్లటి అద్దాలు మూసిన 
లిమోజిన్  కారులా 
కదులుతున్నాయి  జ్ఞాపకాలు  ! 

Translated into Telugu by Jayaprabha

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2016 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin

An einem heißen Juli-Tag

alemão | Tom Schulz

wurde der Vater in einen Plastiksack gepackt, ein Bündel
Knochen noch das rasch verfeuert wurde - er sprach
zuvor, als er in seinem Sterbezimmer lag

kaum mehr ein Wort, Sonnenstrahlen schossen die Wände
hoch - kein Reich das kommen würde, das ihn zu sich rief
nicht zu entziffern die Kinderschrift der Seele

in mir ein Blindenhund nahm seine Hand
und wechselte die Straßenseite, Schüsse fielen dabei röhrte,
röchelte nur der Auspuff eines Käfer wir leben länger als wir
denken können

Steine in Früchten sind wir, oder Eingewecktes in Nächten,
in denen ich durch Schlaf
und Traum bis zu der Kammer wandle voll duftendem
Rosinenbrot

manchmal wenn ich stehen bleibe, berühren sich unsere
Zehennägel vor der Waschkommode mein Haar ganz gelb - ein
Hauch von Sommer weht durchs Zimmer, Schwalbenrauch

© 2015 Hanser Berlin in der Carl Hanser Verlag GmbH & Co. KG, München
from: Lichtveränderung. Gedichte
München: Hanser Berlin, 2015
Audio production: Goethe Institut, 2016

మండువేసవి లో ఒకరోజు

telugu

మండు వేసవిలో  ఒకరోజు 
ప్లాస్టిక్ సంచీలో  మూట కట్టిన 
నాన్నశరీరం 
త్వరగానే కాలిపోయిన  ఎముకల మూట .

చనిపోయే ముందు 
' చావుగది' లో 
కష్టంమీద ఒకటి రెండు మాటలు మాట్లాడేడు నాన్న !  

మధ్యాహ్నపు సూర్యుడి కిరణాలు 
ఇంటి నడికప్పు మీద  పడుతున్నాయి 
దేముడినించి  పిలుపేమీ  రాలేదు 
చిత్రమైనది  ఆత్మ పరిభాష 
పసివాడి చేతిరాతలా  గూఢమైనది ,
విశదీకరించలేనిది !

నాలోని కుక్క 
గుడ్డివాడిని  చేయిపట్టుకుని రోడ్డుని దాటించినట్టు 
నన్ను రోడ్డుని దాటించింది !

తుపాకీ కాల్పులు 
బీటిల్  కారు వెనక  పొగగొట్టం  లోంచి 
చావుగురక మాదిరి 
వస్తోంది శబ్దం !

జ్ఞాపకాలు చెరిగి పోతున్నా ... 
అనుకున్నదానికన్నా 
ఎక్కువేగా  ఈ బతుకు !
పండులోని పిక్కలా ఉన్నా, 
రాత్రుళ్ళలో ... 
ఊరిన ఉసిరికాయలాగాను . 

నిద్రలో .. కలలో 
ఎండు ద్రాక్షల  తీపి వాసన వేసే రొట్టె కోసమని 
నడుచుకుంటూ...  
సామాన్ల గదిలోకి వెళ్లాను . 

అప్పుడప్పుడు  అక్కడున్న 
వాష్ బేసిన్ దగ్గిర 
కాసేపు ఆగుతాను ,
దానికిందనే 
కాలిజోళ్ళ  గూడు . 
ఒకదానికొకటి  తగులుతాయి 
మన కాలివేళ్ల  కొసలు . 

 నా జుట్టు రంగు  పసుపుగా ఉంది !
మంద్రంగా ... గ్రీష్మపు సంజ్ఞ లాగా 
గాలి 
గదిలోంచి  వెళుతుంది !
కాటుక పిట్ట మాదిరి  పొగ 
పైకి లేచి పోయింది !!

Translated into Telugu by Jayaprabha

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2016 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin