An einem heißen Juli-Tag

wurde der Vater in einen Plastiksack gepackt, ein Bündel
Knochen noch das rasch verfeuert wurde - er sprach
zuvor, als er in seinem Sterbezimmer lag

kaum mehr ein Wort, Sonnenstrahlen schossen die Wände
hoch - kein Reich das kommen würde, das ihn zu sich rief
nicht zu entziffern die Kinderschrift der Seele

in mir ein Blindenhund nahm seine Hand
und wechselte die Straßenseite, Schüsse fielen dabei röhrte,
röchelte nur der Auspuff eines Käfer wir leben länger als wir
denken können

Steine in Früchten sind wir, oder Eingewecktes in Nächten,
in denen ich durch Schlaf
und Traum bis zu der Kammer wandle voll duftendem
Rosinenbrot

manchmal wenn ich stehen bleibe, berühren sich unsere
Zehennägel vor der Waschkommode mein Haar ganz gelb - ein
Hauch von Sommer weht durchs Zimmer, Schwalbenrauch

© 2015 Hanser Berlin in der Carl Hanser Verlag GmbH & Co. KG, München
Extraído de: Lichtveränderung. Gedichte
München: Hanser Berlin, 2015
Produção de áudio: Goethe Institut, 2016

మండువేసవి లో ఒకరోజు

మండు వేసవిలో  ఒకరోజు 
ప్లాస్టిక్ సంచీలో  మూట కట్టిన 
నాన్నశరీరం 
త్వరగానే కాలిపోయిన  ఎముకల మూట .

చనిపోయే ముందు 
' చావుగది' లో 
కష్టంమీద ఒకటి రెండు మాటలు మాట్లాడేడు నాన్న !  

మధ్యాహ్నపు సూర్యుడి కిరణాలు 
ఇంటి నడికప్పు మీద  పడుతున్నాయి 
దేముడినించి  పిలుపేమీ  రాలేదు 
చిత్రమైనది  ఆత్మ పరిభాష 
పసివాడి చేతిరాతలా  గూఢమైనది ,
విశదీకరించలేనిది !

నాలోని కుక్క 
గుడ్డివాడిని  చేయిపట్టుకుని రోడ్డుని దాటించినట్టు 
నన్ను రోడ్డుని దాటించింది !

తుపాకీ కాల్పులు 
బీటిల్  కారు వెనక  పొగగొట్టం  లోంచి 
చావుగురక మాదిరి 
వస్తోంది శబ్దం !

జ్ఞాపకాలు చెరిగి పోతున్నా ... 
అనుకున్నదానికన్నా 
ఎక్కువేగా  ఈ బతుకు !
పండులోని పిక్కలా ఉన్నా, 
రాత్రుళ్ళలో ... 
ఊరిన ఉసిరికాయలాగాను . 

నిద్రలో .. కలలో 
ఎండు ద్రాక్షల  తీపి వాసన వేసే రొట్టె కోసమని 
నడుచుకుంటూ...  
సామాన్ల గదిలోకి వెళ్లాను . 

అప్పుడప్పుడు  అక్కడున్న 
వాష్ బేసిన్ దగ్గిర 
కాసేపు ఆగుతాను ,
దానికిందనే 
కాలిజోళ్ళ  గూడు . 
ఒకదానికొకటి  తగులుతాయి 
మన కాలివేళ్ల  కొసలు . 

 నా జుట్టు రంగు  పసుపుగా ఉంది !
మంద్రంగా ... గ్రీష్మపు సంజ్ఞ లాగా 
గాలి 
గదిలోంచి  వెళుతుంది !
కాటుక పిట్ట మాదిరి  పొగ 
పైకి లేచి పోయింది !!

Translated into Telugu by Jayaprabha

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2016 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin