Ram Das Akella 
Translator

on Lyrikline: 7 poems translated

from: الروسية to: التيلجو

Original

Translation

КАРЛИКИ НА ПЛЕЧАХ ВЕЛИКАНОВ

الروسية | Wjatscheslaw Kuprijanow

Не у каждого великана
есть охота и время
поддерживать карликов. Но
карлики ухитряются находить
возможность поддерживать великанов
хотя бы по частям:  вот карлик
поддерживает печень великана –
ты сидишь у меня в печенках –
досадует великан и пересаживает
карлика себе на плечи. Вот
карлик поддерживает легкие, мешая
дыханию и вдохновению,  великан
выплевывает карлика себе на плечо.
Вот карлик в позе атланта
поддерживает сердце великана, шепчет:
главное в сердце – это желудочек,
великан в сердцах вытаскивает
карлика на свет и сажает на плечи.
Карлики поддерживают глазные яблоки,
надкусывая отраженное в них небо,
они залезают в ушную раковину
и крадут по капле шум океана,
они ложатся костьми под язык,
лишь бы вмешиваться в речь великана,
сплачиваются в артель по поддержке
строения головного мозга великана,
стараясь сталкивать друг с другом
левое и правое полушарие.
Все они скапливаются на плечах великана,
они похлопывают его по плечу,
карлики сердца,  карлики мысли,
карлики речи, карлики духа –
дух захватывает, когда с высоты
чужого плеча, они вещают, поют и пляшут,
и вот уже ты сам пляшешь
под слаженный ансамбль их оглушительных дудок.

© Вячеслав Куприянов
Audio production: Вячеслав Куприянов, 2013

మహాకాయుల భుజాల మీద మరుగుజ్జులు

التيلجو

మరుగుజ్జులకి అండగా నిలబడాలనే
కోరికా తీరికా
అందరు మహాకాయులకీ ఉండవు.  కానీ
మరుగుజ్జులు మహాతెలివిగా కనిపెడతారు
మహాకాయులికి ఊతనిచ్చే అవకాశం,
కనీసం పాక్షికంగా.  అడుగో ఓ మరుగుజ్జు
మహాకాయుడి కాలేయానికి మద్దతు ప్రకటించాడు.
నువ్వు నా కాలేయంలో తిష్ఠ వేశావు అంటూ
చికాకు పడ్డ మహాకాయుడు మరుగుజ్జుని
ఎత్తి బుజం మీద కూర్చోబెట్టుకుంటాడు.  ఇంకో
మరుగుజ్జు ఊపిరితిత్తులకి చేయూతనిచ్చి
ఊపిరీ ఉత్తేజమూ ఆడకుండా చేస్తే మహాకాయుడు
అతణ్ణి తన బుజమ్మీదకి ఉమ్మేస్తాడు.  అడుగో ఇంకో
మరుగుజ్జు అట్లాస్ పోజులో మహాకాయుడి గుండె
పైకెత్తి పట్టుకుని రహస్యంగా చెబుతాడు
గుండెలో అతిముఖ్యమైనది కోష్ఠం (వెంట్రిక్ల్) అనే ఖాళీప్రదేశం.
మహాకాయుడు మహాకోపంతో మరుగుజ్జుని వెలికితీసి
బుజమ్మీద కూర్చోబెడతాడు.
మరుగుజ్జులు కనుగుడ్లకి అండగా నిలబడి
వాటిలో ప్రతిబింబిస్తున్న ఆకాశాన్ని కొరుకుతారు.
వాళ్ళు చెవిదొప్పలో దూరి
సముద్రపు హోరు దొంగిలిస్తారు బొట్టుబొట్టుగా.
నాలిక కింద పడుకుంటారు బొమికల్లాగా,
ఎలాగోలాగ మహాకాయుడి మాటకి ఆటంకం కలిగించాలి కదా.
మహాకాయుడి మెదడు నిర్మాణానికి అండగా నిలిచే
సహకారసంఘ సభ్యులుగా సమైక్యమై
ఎడమ కుడి అర్థగోళాలని నెట్టివేస్తుంటారు.
వాళ్ళందరూ మహాకాయుడి బుజాలమీద గుమిగూడి
అతని భుజాలు తట్టుతుంటారు -
గుండె మరుగుజ్జులూ, ఆలోచన మరుగుజ్జులూ,
మాట మరుగుజ్జులూ, మనసు మరుగుజ్జులూ.
పరాయి భుజపు ఎత్తుల నించి వాళ్ళు
ప్రసారాలు చేస్తుంటే, పాడుతుంటే, చిందులు తొక్కుతుంటే
ఊపిరాడదు.  అదిగా అప్పుడే నువ్వు కూడా గంతులేస్తున్నావు
వాళ్ళ పొందికైన బృందం చెవులుచిల్లులుపడేలా వాయిస్తున్న వేణువులు వింటూ.

Translated directly from Russian into Telugu by Ram Das Akella

УРОК РИСОВАНИЯ

الروسية | Wjatscheslaw Kuprijanow

Ребенок не может нарисовать
море
ребенок не может нарисовать  
землю
у него не сходятся меридианы
у него пересекаются параллели
он выпускает
на волю неба
земной шар
из координатной сети
у него не укладываются
расстояния
у него не выходят
границы
он верит
горы должны быть
не выше надежды
море должно быть
не глубже печали
счастье
должно быть не дальше земли
земля
должна быть
не больше
детского сердца

© СП, Москва
from: Жизнь идет
СП, Москва, 1982
Audio production: Вячеслав Куприянов, 2013

చిత్రలేఖనం పాఠం

التيلجو

చిన్నపిల్లాడికి చేతకావడం లేదు చిత్రించడం
సముద్రాన్ని
చిన్నపిల్లాడికి చేతకావడం లేదు చిత్రించడం
భూమిని
అతని మధ్యాహ్నరేఖలు కలుసుకోవడం లేదు
సమాంతర రేఖలు ఒకదాన్నొకటి అడ్డుకుంటున్నాయి
భూగోళం
అక్షాంశాల రేఖాంశాల వల నించి తప్పించుకుని
ఆకాశం మీద
స్వేచ్ఛగా విహరిస్తోంది
అతని చిత్రంలో దూరాలు
ఇమడడం లేదు
సరిహద్దులు
సరిగా కనబడ్డం లేదు
అతని నమ్మకం -
కొండలు ఉండకూడదు
ఆశ కన్నా ఎత్తుగా,
సముద్రం ఉండకూడదు
దుఃఖం కన్నా లోతుగా,
సంతోషం ఉండకూడదు
ఎక్కడో భూమికి దూరంగా,
భూమి
ఉండకూడదు
చిన్నపిల్లాడి గుండె కన్నా
పెద్దగా

Translated directly from Russian into Telugu by Ram Das Akella

СЛЕЗЫ МИРА

الروسية | Wjatscheslaw Kuprijanow

Еще не ведая мирского горя
но уже осязая холод мира
и пугаясь его непроглядной ночи
чистыми слезами плачут дети

И уже взрослые на краю жизни
зачем они выросли не понимая
в беге времени улучив минуту
плачут темными тяжелыми слезами

И все-таки все по-разному плачут
чей-то плач разменная мелкая монета
а у иных и слезы золотые
они их складывают в отдельную копилку

Глядя на людей и ангелы плачут
их слезы снежинки в Рождественский вечер
а в обычные дни у их слез задача
поддерживать уровень мирового океана

© Новый ключ
from: «Ода времени», стихотворения
Новый ключ, 2010
Audio production: Вячеслав Куприянов, 2013

ప్రపంచపు కన్నీళ్ళు

التيلجو

ఇహలోకంలో దుఃఖం అంటే ఏమిటో ఇంకా అవగాహన లేకపోయినా
ప్రపంచపు ఉదాసీన శీతలత్వాన్ని అప్పుడే పసిగడుతూ
కన్నుపొడుచుకున్నా కానరాని రాత్రుళ్ళకి భయపడుతూ
కల్తీలేని కన్నీళ్ళతో ఏడుస్తుంటారు పసిపిల్లలు

ఇహ సరే కాటికి కాళ్ళు చాచుకున్న పెద్దవాళ్ళు
అస లెందుకు పెరిగి పెద్దవాళ్ళయ్యారో కూడా అర్థంకాక
ఆఘమేఘాలమీద పారిపోతున్న కాలం నించి ఒక నిమిషం లాక్కుని
కారుస్తారు బరువైన చిక్కటి చీకటి కన్నీళ్ళు

అందరూ ఏడుస్తారు, పద్ధతులు ఎంత వేరువేరైనా
కొందరి ఏడుపు చిల్లరకి పనికొచ్చే నాణెం
మరికొందరి కన్నీళ్ళు బంగారం
వాటిని వాళ్ళు ప్రత్యేకమైన గల్లాపెట్టెలో దాచుకుంటారు

మనుషులకేసి చూసి దేవతలు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు
వాళ్ళ కన్నీళ్ళు క్రిస్మస్ సాయంకాలం మంచుపింజలు
మామూలు రోజుల్లో వాళ్ళ కన్నీళ్ళ కర్తవ్యం
భూమ్మీద సముద్రమట్టాన్ని హెచ్చుతగ్గులు లేకుండా కాపాడడం

Translated directly from Russian into Telugu by Ram Das Akella

ПЕСНЬ ОДИССЕЯ

الروسية | Wjatscheslaw Kuprijanow

Когда мой корабль причалит к берегу,
Вместе со мной сойдет на берег песня,
Её прежде слушало только море,
Где она соперничала с зовом сирен.
В ней будут только влажные гласные звуки,
Которые так звучат в бледном переводе
С языка скитаний на язык причала:

Я люблю тебя охрипшим криком морских чаек,
Клекотом орлов, летящих на запах печени Прометея,
Тысячеликим молчаньем морской черепахи,
Писком кашалота, который хочет быть ревом,
Пантомимой, исполненной щупальцами осьминога,
От которой все водоросли встают дыбом.

Я люблю тебя всем моим телом вышедшим из моря,
Всеми его реками, притоками Амазонки и Миссисипи,
Всеми пустынями, возомнившими себя морями,
Ты слышишь, как их песок пересыпается в моем пересохшем горле.

Я люблю тебя всем сердцем, легкими и зеницей ока,
Я люблю тебя земной корой и звездным небом,
Падением водопадов и спряжением глаголов,
Я люблю тебя нашествием гуннов на Европу,
Столетней войной и татаро-монгольским игом,
Восстанием Спартака и Великим переселением народов,
Александрийским столпом и Пизанской башней,
Стремлением Гольфстрима согреть Северный полюс.

Я люблю тебя буквой закона тяготения
И приговором к смертной казни,
К смертной казни через вечное падение
В твой бездонный Бермудский треугольник.

© Новый ключ
from: «Ода времени», стихотворения
Новый ключ, 2010
Audio production: Вячеслав Куприянов, 2013

ఒదిస్సేఉస్ (యూలిసిస్) వీరగాథ

التيلجو

నా ఓడ ఒడ్డుకి చేరి లంగరు వేసినప్పుడు
నాతోబాటు ఓడదిగుతుంది పాట,
ఇదివరకు దాన్ని సముద్రం మాత్రమే వినేది,
అక్కడ అది సైరన్ల పిలుపులతో పోటీ పడేది.
అందులో ఉంటాయి తడి అచ్చుల ధ్వనులు మాత్రమే.
అవి సముద్రవిహారాల భాషనించి లంగరుతాడు భాషలోకి
చేసిన పేలవమైన అనువాదంలో ఇలా ఉంటాయి -

నాకు నువ్వంటే ఇష్టం, సముద్ర గల్ పక్షుల బొంగురుగొంతు అరుపులతో,
ప్రొమితేఉస్ కాలేయం వాసనకేసి ఎగిరే రాబందుల కీచు కూతలతో,
సముద్ర తాబేలు వెయ్యితలల మౌనంతో,
కషలోట్ తిమింగలం కిచకిచతో - అదెంత గర్జనగా మారిపోవాలనుకుంటున్నా సరే -
ఆక్టోపస్ గ్రహణాంగాలు (టెంటకిల్స్) చేసే మూకాభినయంతో.
ఆ ప్రదర్శనకి సముద్రపు కలుపుమొక్కలన్నీ నిటారుగా నిలబడతాయిగా.

నాకు నువ్వంటే ఇష్టం, సముద్రంనించి బయటికొచ్చిన నా సంపూర్ణ శరీరంతో.
ఆ సముద్రపు నదులన్నిటితో, అమెజాన్ మిసిసిపి నదుల ఉపనదులతో,
తాము సముద్రాలమని ఊహించుకుంటున్న ఎడారు లన్నిటితో.
నీకు వినిపిస్తోందిగా, వాటి ఇసక ఎలా నా ఎండిపోయిన గొంతులో జల్లుగా కురుస్తోందో?

నాకు నువ్వంటే ఇష్టం, హృదయపూర్వకంగా, ఊపిరితిత్తుల పూర్వకంగా, కంటిపాప పూర్వకంగా.
నాకు నువ్వంటే ఇష్టం, భూమి ఉపరితలంతో, నక్షత్రఖచిత ఆకాశంతో,
జలపాతాల దిగజారుడుతో, క్రియల రూపాల నిష్పత్తితో,
నాకు నువ్వంటే ఇష్టం, ఐరోపామీద హూణుల దండయాత్రతో,
నూరేళ్ళ యుద్ధంతో, తతార్-మంగోల్ అధికార పెత్తనంతో,
స్పార్టకస్ తిరుగుబాటుతో, ఐరోపా దేశాల ప్రజల మహావలసతో,
అలెక్సాండ్రియా స్తంభంతో, పీసా టవరుతో,
ఉత్తర ధృవాన్ని వేడెక్కించాలని గల్ఫ్ స్ట్రీమ్ చేసే ప్రయత్నాలతో.
నాకు నువ్వంటే ఇష్టం, భూమ్యాకర్షణ నియమ వివరణాక్షరంతో,
మరణశిక్ష విధింపుతో, నీ అడుగంటూ లేని బెర్ముడా త్రిభుజంలో
శాశ్వతంగా పడవేయమని విధించిన మరణశిక్షతో.

Translated directly from Russian into Telugu by Ram Das Akella

БОЙ ЧАСОВ

الروسية | Wjatscheslaw Kuprijanow

Безработные часовщики вышли
на остановку времени с боями
встали часы с боем механически
остановились механические часы    
полегли настольные часы настенные
часы пали смертью храбрых рухнули
башенные часы вместе с башнями
где были заточены приговоренные
к пожизненному заточению матерые
убийцы времени по карману ударили
карманные часы наручные превратились
в на ручники на поддержку безвременно
безработных часовщиков бросились толпы
безнадежно безденежных и одиночные
группы бессребреников на подавление
бунтовщиков были направлены регулярные
части вооруженные острыми часовыми
минутными и секундными стрелками
на их пустых знаменах
было написано время — деньги

© Вячеслав Куприянов
Audio production: Вячеслав Куприянов, 2013

గడియారం గంటల మోత

التيلجو

గడియారాలు తయారుచేసే నిరుద్యోగులు బయల్దేరారు
కాలాన్ని ఆపడానికి గంటలు కొట్టే గడియారాలు
గంటలు కొట్టడం మొదలుపెట్టాయి మెకానికల్గా
ఆగిపోయాయి మెకానికల్ గడియారాలు
టేబుల్ గడియారాలు నేలకొరిగాయి గోడగడియారాలు
వీరోచిత మృత్యువు పాలయ్యాయి టవర్ గడియారాలు
టవర్లతో సహా కూలిపోయాయి ఆ టవర్లలో ఇదివరలో కాలాన్ని
చంపే కరుడుగట్టిన కాలహంతకుల్ని ఆజన్మ కారాగారంలో
బంధించి ఉంచారు జేబుగడియారాలు జేబుమీద తట్టాయి
చేతిగడియారాలు కాలవ్యవధిలేకుండా నిరుద్యోగులైన గడియారాలుచేసేవాళ్ళకి
మద్దతుగా చిల్లులు పొడిచే పంచర్లుగా మారిపోయాయి నిరాశకి లోనైన నిర్ధనులూ
బొత్తిగా ధనాశలేనివాళ్ళ ఒంటరి బృందాలూ గుంపులుగా గుమిగూడారు
ఈ తిరుగుబాటుదార్ల అణచివేత కోసం పంపించారు స్థాయీ సైన్యవిభాగాల్ని
వాళ్ళ ఆయుధాలు గడియారాల నిమిషాల సెకండుల వాడి ముల్లులు
వాళ్ళ ఖాళీ జెండాల మీద రాసి ఉంటుంది
కాలమే సొమ్ము సుమా అని

Translated directly from Russian into Telugu by Ram Das Akella

* * * [В этом торгующем мире]

الروسية | Wjatscheslaw Kuprijanow

В этом торгующем мире
взрослые расхватали
все детские игрушки,
потому что дети
не доросли до прилавка.

Протезы для безногих
расхватали двуногие,
пока безногие ковыляли
на костылях в магазины:
МЫ ДОЛЖНЫ БЫТЬ
ВЕЗДЕ ВПЕРЕДИ –
твердили двуногие,
выбегая из магазинов
на четырех ногах.

Протезы для безруких
расхватали двурукие,
потому что безруким
нечем было на них
заработать деньги:
СВОЯ РУКА – ВЛАДЫКА –
твердили двурукие,
расталкивая очередь при выходе
четырьмя руками.

Объявили всем
световые рекламы:
появились в продаже
глазные протезы –
увидели зрячие,
расхватали стеклянные очи
и говорили при этом
бестолковым слепым:
ЗА ВАМИ ГЛАЗ ДА ГЛАЗ НУЖЕН.

Появились в продаже
протезы голов.
Пока до безголовых дошло,
головастые все расхватали,
твердя при этом:
УМ – ХОРОШО, А ДВА – ЛУЧШЕ,
к тому же будет можно
ВАЛИТЬ С БОЛЬНОЙ ГОЛОВЫ
НА ЗДОРОВУЮ.

Наконец, объявили
в свежих газетах:
ДА ИМЕЙТЕ ЖЕ СОВЕСТЬ! –
И пока бессовестные рассуждали –
На черта нам эта СОВЕСТЬ! –
как имущие совесть
все расхватали
и твердили при этом:
ведь у нас же
СВОБОДА СОВЕСТИ,
так что у нас теперь
БУДЕТ СОВЕСТЬ
И ДЛЯ ПРОДАЖИ.

А все началось с того,
что в этом торгующем мире
взрослые расхватали
все детские игрушки,
потому что дети
не доросли до прилавка.

© Вячеслав Куприянов
Audio production: Вячеслав Куприянов, 2013

ఈ వ్యాపారాలు చేసే ప్రపంచంలో

التيلجو

ఈ వ్యాపారాల ప్రపంచంలో
చిన్నపిల్లల ఆటవస్తువు లన్నీ
పెద్దవాళ్ళు లాగేసుకున్నారు,
ఎంచేతంటే పిల్లలు దుకాణం కౌంటరు దాకా
ఎదగలేదు కాబట్టి.

కాళ్ళులేనివాళ్ళు చంకకర్రల సాయంతో
దుకాణాల చుట్టూ తిరిగే లోపల
రెండుకాళ్ళూ ఉన్నవాళ్ళు
కృత్రిమ అవయవాలన్నీ కాజేసుకున్నారు.
మేం ప్రతీచోటా ముందుండాలి
అన్నారు రెండుకాళ్ళవాళ్ళు
దుకాణాల నించి గబగబా
నాలుగుకాళ్ళ మీద వెళ్ళిపోతూ.

చేతులులేనివాళ్ళ కోసం ఉద్దేశించిన కృత్రిమ అవయవాలన్నీ
రెండుచేతులూఉన్నవాళ్ళు దోచేసుకున్నారు,
ఎంచేతంటే చేతులులేనివాళ్ళు వాటి సాయంతో
ఎలాగూ డబ్బు సంపాదించలేరు కాబట్టి.
ఎవరికైనా స్వంత చెయ్యే ప్రభువు
అన్నారు రెండుచేతులవాళ్ళు
క్యూలో ఉన్నవాళ్ళని
నాలుగుచేతుల్తో తోసుకుంటూ బయటికి వెళ్ళిపోతూ.

రంగురంగుల వ్యాపారప్రకటనలు
అందరికీ అందాయి -
అమ్మకానికి వచ్చాయి
కృత్రిమ కళ్ళు.
చూపున్నవారు అది చూసి
గాజుకళ్ళన్నీ చేజిక్కించుకున్నారు.
ఏమీ అర్థంకాని గుడ్డివాళ్ళతో వాళ్ళు అన్నారు కదా
మీరు కంటికి కన్ను చెల్లించవలసిందే.

అమ్మకానికి వచ్చాయి
కృత్రిమ తలలు.
ఈ విషయం తలలేనివాళ్ళకి తెలిసే లోపల
పెద్దపెద్దతలలవాళ్ళు అన్నీ పట్టుకుపోయారు.
పోతూ అన్నారు గదా
ఒక తల ఉంటే మంచిదే కాని రెండుంటే ఇంకా మెరుగు,
పైగా ఇంకో అదనపు సౌకర్యం ఏమిటంటే
తలనొప్పి వచ్చినప్పుడు
తల మార్చుకోవచ్చు
.

చివరికి ప్రకటించారు
తాజా వార్తాపత్రికల్లో
చిత్తశుద్ధి, ఉంచుకోండి కాస్త చిత్తశుద్ధి
చిత్తశుద్ధిలేనివాళ్ళు
మన కెందు కొచ్చిందీ చిత్తశుద్ధి అని తర్జనభర్జన చేసేలోగా
అది ఉన్నవాళ్ళు
అంతా అంకించేసుకున్నారు.
వాళ్ళ ఉవాచ -
మనకి ఎలాగూ ఉందిగా
చిత్తశుద్ధి స్వాతంత్ర్యం,
ఇంకిప్పుడు ఇంచక్కా ఉంటుంది చిత్తశుద్ధి
అమ్ముకునే
అవకాశం కూడా
.

చెప్పానుగా, అసలంతా ఎక్కడ మొదలైందంటే,
ఈ వ్యాపారంచేసే ప్రపంచంలో
చిన్నపిల్లల ఆటవస్తువులన్నీ
పెద్దవాళ్ళు లాగేసుకున్నారు
ఎంచేతంటే పిల్లలు కొట్టుకౌంటరు అంత
ఎత్తు ఎదగలేదు కాబట్టి.

Translated directly from Russian into Telugu by Ram Das Akella

УРОК АНАТОМИИ

الروسية | Wjatscheslaw Kuprijanow

Простите
ученики
но из моего скелета
не выйдет
хорошего наглядного пособия

Еще при жизни
я так любил жизнь и свободу
что взломал свою грудную клетку
чтобы дать волю сердцу
а из каждого ребра
я пытался
сотворить женщину

Голову еще при жизни
я ломал
над вопросами жизни

Какой уж тут
череп

© Вячеслав Куприянов
Audio production: Вячеслав Куприянов, 2013

శరీరనిర్మాణశాస్త్రం పాఠం

التيلجو

క్షమించండి
విద్యార్థులారా
నా అస్థిపంజరం
ఒక మంచి దృశ్య బోధనాసాధనం
కానేరదు

ఇంకా బతికుండగానే
నాకు జీవితమూ స్వాతంత్ర్యమూ అంటే ఎంత ఇష్ట మంటే
నా గుండెకి స్వేచ్ఛ నివ్వడం కోసం
రొమ్ము విరగ్గొట్టుకున్నాను
ఒక్కొక్క రొమ్ముఎముక నించి
ఒక్కొక్క స్త్రీని
సృష్టించాలని ప్రయత్నించాను

ఇంకా బతికుండగానే
బుర్ర బద్దలుకొట్టుకున్నాను
జీవితం గురించి ప్రశ్నల మీద

ఇహ ప్రశ్నే లేదు
పుర్రె గురించి

Translated directly from Russian into Telugu by Ram Das Akella